ఇవాళ 1595 గ్రూప్ 4 పోస్టులకు పరీక్ష

Today is the test for 1595 Group 4 posts

Today is the test for 1595 Group 4 posts

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించనున్నారు.తెలంగాణలో గ్రూప్-4 పోస్టులకు సంబంధించి ఆదివారం రాతపరీక్ష నిర్వహించనున్నారు.
రాతపరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికేపూర్తిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.
మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
టాప్ వ్యాఖ్య… పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా.. లోపలికి అనుమతించరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
* పరీక్షా కేంద్రానికి వచ్చేటపుడు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదో ఒకటి తీసుకురావచ్చు.
* పరీక్షా కేంద్రాల్లోకి వాచీలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మరే ఇతర వస్తువులను అనుమతించరు. ఎలాంటి ఆభరణాలు కూడా ధరించకూడదు.
* వదులుగా ఉండే దుస్తులు కూడా ధరించకూడదు.
* బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే పరీక్ష రాయడానికి వినియోగించాలి. అదనంగా పెన్నులు తెచ్చుకోవడం ఉత్తమం.
రాతపరీక్ష, సిలబస్ వివరాలు…
మొత్తం రెండు పేపర్లకుగాను 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 లో జనరల్ నాలెడ్జ్, పేపర్-2లో సెక్రటేరియల్ ఎబిలిటీస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
Tags:Today is the test for 1595 Group 4 posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *