ఇవాళ గోవాలో బలపరీక్ష

Today is the test of strength in Goa
Date:19/03/2019
పానాజీ ముచ్చట్లు:
గోవా అసెంబ్లీలో బలపరీక్ష ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనోహర్ పారికర్ మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించామని, ఇది పూర్తయ్యే వరకు తనకెవరూ శుభాకాంక్షలు చెప్పొద్దని, పూలతో స్వాగతించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని సావంత్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంలుగా విజయ్ సర్దేశాయ్, సుదిన్ దవలికర్‌లు కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. పారికర్ మృతి చెందిన తర్వాత గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ ను ఆహ్వానించాలంటూ గవర్నర్ మృదుల సిన్హాకు ఆ పార్టీ నాయకులు లేఖ అందించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ లేఖలో పేర్కొంది. 40 స్థానాలున్న గోవా శాసనసభలో ప్రస్తుతం 36 మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్ సభ్యులు 14 మంది, బీజేపీకి చెందినవారు 12 మంది ఉన్నారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలకు చెరో మూడు స్థానాలున్నాయి. ఈ ఆరుగురు సభ్యులతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.
Tags:Today is the test of strength in Goa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *