Natyam ad

నేడే తుంగా ఆరతి. పీఠాధిపతులు చేతుల మీదుగా పుణ్య నదీ హరతి  తుంగాతీరంలో లక్ష దీపోత్సవం

మంత్రాలయం ముచ్చట్లు:

ఆదివారం కార్తీక శుద్ధ త్రయోదశి రోజున తుంగా హారతి శ్రీమఠం  పీఠాధిపతులు చేతుల మీదుగా పుణ్య నదిహారతిని నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగామంగళవారం జరగాల్సిన తుంగ హారతి కార్యక్రమాన్ని చంద్రగ్రహణం సందర్భంగా రెండు రోజులు ముందంగా  త్రయోదశి ఆదివారం రోజుకు మార్చి నట్టు శ్రీమఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు తెలిపారు.ఆదివారం సాయంత్రం పీఠాధిపతుల ఆధ్వర్యంలో తుంగ హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేనేజర్ తెలిపారు. తుంగభద్ర నది తీరాన తుంగభద్రా నదికిపుణ్య హారతులు అలాగే తుంగా తీరాన లక్షదీపోత్సవం  కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు  శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు.

 

Tags: Today is Tunga Aarti. Punya Nadi Harati by the hands of the prelates
Laksh Deepotsavam in Tungatheer

Post Midle
Post Midle