Natyam ad

నేడు ప్రపంచ తేనెటీగ దినోత్సవం    

విజయవాడ ముచ్చట్లు:


ప్రపంచ తేనెటీగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీవావరణవ్యవస్థలో తేనెటీగలు, ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తుచేసుకోవడంకోసం తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా పేరొందిన అంథొన్ జంసా గుర్తుగా ఆయన జన్మదినమైన మే 20 రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1934, మే 20న తేనెటీగల పెంపకంలో నిపుణుడైన అంథొన్ జంసా స్లొవేనియాలో జన్మించాడు. 2017, డిసెంబరులో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, మే 20ను ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలన్న స్లోవేనియా ప్రతిపాదనను అమోదించాయి. మానవాళికి ఎంతో మేలు చేసున్న తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. 2018, మే 20న తొలిసారిగా ప్రపంచ తేనెటీగ దినోత్సవం జరుపబడింది. తేనెటీగలు పూవుల్లోఉన్న తీయని మకరందాన్ని గ్రహించి తేనేపట్టులో పొదుపు చేస్తుంది. మానవులు మార్కేట్ లో తేనెనుఅధిక ధరకు అమ్ముతారు. సురక్షిత ఆరోగ్యం కొరకుతేనెను వాడుతారు. తేనెటీగల సంరక్షణ, యాజమాన్యం అనే అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు.క్షేత్ర పర్యటనలో భాగంగా తేనెటీగలను పెంచే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో ప్రత్యక్షంగా చూపిస్తారు. తేనె తయారీ విధానం, తేనెలో ఉండే పోషక విలువలు వాటి ఆరోగ్య ప్రాధాన్యత, ప్యాకింగ్‌ మొదలైనవి నేర్పిస్తారు.

 

Tags: Today is World Bee Day

Post Midle
Post Midle