నాడు -నేడు పటిష్టంగా అమలు చేయాలి

Date:13/01/2020

– ఎంఈవో కేశవరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు అన్ని పాఠశాలలను మూడు సంవత్సరాలలోపు అభివృద్ధి చేసేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరుస్తామని ఎంఈవో కేశవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని 35 పాఠశాలలను నాడు- నేడు కార్యక్రమం క్రింద ఎంపిక చేశామన్నారు. ఈ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఎంపిక కాబడిన పాఠశాలలు 13 , 14, 15 తేదీలలో నాడు – నేడు క్రింద భూమిపూజలు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు , ప్రతి తరగతి గదికి విద్యుత్‌దీపాలు , ఫ్యాన్లు , తాగునీరు , విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫర్నిచర్‌తో పాటు ప్రహారీలకు రంగులు వేయడం , భవనాల మరమ్మతులు, గ్రీన్‌చార్ట్ బోర్డులు , ఇం•ష్‌ ల్యాబ్‌, ప్రహారీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల కమిటిలు తక్షణమే సంబంధిత హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి ఈ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

చురుగ్గా ఆర్టీసి డిపో పనులు

Tags; -Today should be tightly implemented

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *