Natyam ad

నేడు రాయ‌ల్ ఛాలెంజ్ బెంగ‌ళూరుతో, పంజాబ్ కింగ్స్ ఢీ

బెంగళూరు ముచ్చట్లు:

ఇవాళ ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ్ బెంగ‌ళూరు వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డను న్నాయి. బెంగుళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.ఇక, ఈ మ్యాచ్ లో విజ యం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తు న్నాయి.అయితే, ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోగా.. శనివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇక, ఈ దెబ్బకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మేనేజ్‌మెంట్‌ జట్టులో కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది. బెంగళూ రులోని చిన్నస్వామి స్టేడి యం బ్యాటింగ్‌కు అనుకూ లమైన పిచ్‌.. దీంతో దానికి అనుకూలమైన జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.ఇక, పంజాబ్ కింగ్స్ టీమ్ తొలి మ్యాచ్ లో విజయం సాధించడంతో మంచి ఊపుమీద కనిపిస్తుంది. ఆర్సీబీని సొంత గడ్డపైనే ఓడించి రెండో గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలి అని కెప్టెన్ శిఖర్ ధావన్ చూస్తున్నారు.అయితే, పంజాబ్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయకుండానే మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ జట్టులో స్వల్ప మార్పులను చేయాలని అనుకుంటే మాత్రం ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కి బదులు శశాంక్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.. అలాగే మరోక ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

 

Post Midle

Tags: Today with Royal Challenge Bangalore, Punjab Kings

Post Midle