Today's calendar

ఈనాటి పంచాంగం

Date:03/01/2020

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹ఈనాటి పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,

తేదీ … 03 – 01 – 2020,
వారం … భృగువాసరే 【 శుక్రవారం 】
శ్రీ వికారి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంతఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,

తిధి : అష్టమి రా9.02
తదుపరి నవమి,
నక్షత్రం : రేవతి పూర్తి
యోగం : పరిఘము రా10.25
తదుపరి శివం,
కరణం : భద్ర/విష్ఠి ఉ7.56
తదుపరి బవ రా9.02
ఆ తదుపరి బాలువ,

వర్జ్యం : రా7.04 – 8.50,
దుర్ముహూర్తం : ఉ8.47 – 9.31 &
మ12.26 – 1.10,
అమృతకాలం : తె5.43నుండి,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండం. : మ3.00 – 4.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం : 5.34,

దివ్యవాణి

_ మానవుడు ప్రతీసారి తన సిద్ధాంతాల ప్రకారం జీవించాలని, తను అనుకున్న విధముగా జరగాలని తలుస్తుంటాడు. ఈ భావనే మానవుని అసంతృప్తికి, అశాంతికి, అధోగతికి కారణమైతుంది. నిజానికి మన సిద్ధాంతాలు మనకుంటే భగవంతుని సిద్ధాంతాలు భగవంతునికుంటాయి. ఎవరి నుండైనా ఏదైనా ఆశించడం వలననే మనశ్శాంతి లోపిస్తుంటుంది. విభిన్న ఆలోచనలతో, కుతంత్రాలతో నిండిపోయి ఉన్న మనస్సు కల్పించే సిద్ధాంతాల ప్రకారం కాక భగవంతుని సిద్ధాంతాల ప్రకారం నడచుకుంటే ఈ ఊహలు, భ్రమలు ఏవీ ఉండవు. ఇట్టి వారిని అన్ని వేళలా భగవంతుడే ఆదుకుంటాడు. ఇంకా భగవంతుని ఇష్ట ప్రకారం నడచుకునే వారికి ఎంతటి కష్టమైనా సరే తేలికైపోతుంది. సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. మనశ్శాంతికి ఏ లోటునూ ఉండదు.

🌹శుభమస్తు🌹
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

 

Tags:Today’s calendar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *