నేటి పంచాంగం

Date:04/01/2020

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,

తేదీ … 04 – 01 – 2020,
వారం … స్థిరవాసరే 【 శనివారం 】
శ్రీ వికారి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంతఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,

తిధి : నవమి రా10.50
తదుపరి దశమి,
నక్షత్రం : రేవతి ఉ8.23
తదుపరి అశ్విని
యోగం : శివం రా10.37
తదుపరి సిద్ధం
కరణం : బాలువ ఉ9.56
తదుపరి కౌలువ రా10.50
ఆ తదుపరి తైతుల,

వర్జ్యం : తె6.15నుండి,
దుర్ముహూర్తం : ఉ6.36 – 8.03,
అమృతకాలం : ఉ7.29వరకు,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండం. : మ1.30 -3.00,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం : 5.35,

నేటిమాట
కష్టాలు బాధలు ఎందుకు???

ఒక పర్యాయము యమలోక వాసులు, స్వర్గలోక వాసులు కలసి, భగవంతుని ఉద్దేశించి…
స్వామీ! మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ? మీరు స్వర్గంలో ఉంటారా? కైలాసంలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించారు…

“నా పర్మనెంట్ అడ్రస్ నరకము” అన్నాడు భగవంతుడు!
అరే…!
“భగవంతుడు స్వర్గంలో ఉండకుండా, వైకుంఠంలో, కైలాసంలో కూడ ఉండకుండా, నరకంలో ఉంటున్నాడే!…
ఏమిటి దీని రహస్యము? “అని ఆశ్చరపోయి ”
స్వామీ! పాపము చేసినవారు నరకంలో ఉండాలి కదా!
మరి మీరు ఎందుకుండవలసి వచ్చింది? ” అని అడిగారు.
“నాయనా! నరకలోక వాసులే నన్ను ఎక్కువగా ప్రార్ధిస్తుంటారు,
స్వర్గంలో ఉన్నవారు నన్ను తలవనైనా తలవరు.” అన్నాడు….

కనుకనే లోకములో సంకటమొస్తే వెంకటరమణా…! అంటారు,
అనగా కష్టపడే వారి దగ్గరనే దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటుంది…
మధ్య మధ్య మనకు కష్టాలు, బాధలూ కలిగితే, సరియైన విచారణ శక్తి కలుగుతుంది…

“కలిమి కలిగిననాడు కైలాసపతినైన
ధిక్కరించి పాపి తిరుగుచుండు.
కలిమి తొలగగానె కనిపించు లోకంబు.”

🌸శుభమస్తు🌸
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

 

చెరువులు, కుంటల్లో నీరు రాలేని దుస్థితి

 

Tags:Today’s calendar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *