Natyam ad

నేటి యువత సనాతన హైందవ ధర్మానికి ప్రతీకలు

– మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన కుమారి కీర్తన

– విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న కీర్తన

– కుమారి కీర్తనను అభినందించిన టిటిడి చైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి

 

Post Midle

తిరుమల ముచ్చట్లు:

నేటి యువత సనాతన హైందవ ధర్మానికి ప్రతీకలు, ఆదర్శమని, మొత్తం హిందూ సమాజంలోని యువతి, యువకులు “గోవింద కోటి”ని రాసి శ్రీవారిని దర్శించుకోవాలని టిటిడి చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం మొట్టమొదటిసారిగా గోవింద కోటి రాసిన విద్యార్థిని కుమారి కీర్తనను ఛైర్మన్ అభినందించారు.ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ రామకోటి రాసే సాంప్రదాయం సనాతన భారతీయ సమాజంలో ఉన్నదన్నారు. అదేవిధంగా విద్యార్థులు, చిన్న పిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి బోర్డు ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగా 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవిందా కోటి రాసిన వారికి, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి బోర్డు నిర్ణయించిందన్నారు.

 

 

మొట్టమొదటిసారిగా బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసిందని తెలిపారు. కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించినట్లు చెప్పారు. మొట్టమొదటిసారిగా గోవిందా కోటి రాసిన కుమారి కీర్తనకు శ్రీవారి అనుగ్రహంతో ఉజ్వల భవిష్యత్తు పొందాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.అనంతరం కుమారి కీర్తన మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదైవము అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోవింద కోటిని భక్తిశ్రద్ధలతో రాసినట్లు తెలిపారు.చిన్నతనం నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10 లక్షల మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Today’s youth are symbols of orthodox Hinduism

Post Midle