Today's zodiac fruits

నేటి రాశి ఫలాలు

Date:09/12/2019

రాశి ఫలాలు

మేషరాశి….
కాంట్రాక్టుదారులకు ఆందోళనలు, కొన్ని సందర్భాలలో ధననష్టం సంభవించును. సినీరంగ పరిశ్రమల్లోని వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి…
బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. పూర్వ మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్పెక్యులేషన్ కలసివస్తుంది.

మిథున రాశి…
వృత్తిపనివారు ఇబ్బందులకు గురవుతారు. దూర ప్రయాణాలు ఫలించవు. సాంఘిక, బంధుమిత్రాదులయందు అన్యోన్యత తగ్గుతుంది. వ్యాపార వ్యవహారాలలో జాయింట్ సమస్యలు రావచ్చును. మిత్రుల సహాయముతో మీ పనుల్లో పురోభివృద్ధి పొందుతారు. వివాహాది శుభకార్యములయందు అధికంగా వ్యయం చేస్తారు.

కర్కాటక రాశి
భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఇంటి రుణములు కొన్ని తీరుస్తారు. వాహనయోగం పొందుతారు.

సింహ రాశి…
దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. చేపట్టిన పనులు ఓర్పు, పట్టుదలతో శ్రమించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహావసరాలకు నిధులు సమకూరుతాయి. స్త్రీల కళాత్మకతకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కన్య రాశి…
శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభ పరిణామాలు సంభవం. సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు నెమ్మదిగా తీరతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారస్తులకు ఆశాజనకం. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి.

తుల రాశి…
ప్రేమికుల మధ్య విబేధాలు తొలగిపోతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు వస్తువులు, ఆభరణములు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువర్గాలతో అభిప్రాయబేధాలు తప్పవు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి….
కొబ్బరి, పండ్ల, పూల, బేకరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అలవాట్లు, బలహీనతలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

ధనస్సు రాశి…
ఆత్మీయుల నుంచి శుభాకాంక్షలు, కానుకలు అందుకుంటారు. ముఖ్యులకు ధనం బాగా వెచ్చిస్తారు. గృహాలంకరణకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ప్రముఖుల సహకారంతో మీ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం.

మకర రాశి…
చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి.

కుంభ రాశి…
పత్రిక, ప్రైవేట్, విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. దైవ, ఆరోగ్య విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి.

మీన రాశి….
ఆప్తుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలలో పునరాలోచన అవసరం. కార్యసాధనలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం పొందుతారు.

శుభమస్తు

 

నేటి పంచాంగం

 

Tags:Today’s zodiac fruits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *