Natyam ad

తోడేళ్ల గడ్డ గ్రామ వాసికి డాక్టరేట్ 

-డాక్టరేట్ పీహెచ్డీ పట్టా సాధించిన కాశరాజు

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం తోడేళ్ళ గడ్డ గ్రామవాసి కాశరాజు కి డాక్టరేట్ పీహెచ్డీ పట్టా పొందడం పట్ల గ్రామవాసులు వారికి ఘనంగా సన్మానం తో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. తోడేళ్ళ గడ్డ గ్రామానికి చెందిన చిన్న జంగయ్య కుమారుడు కాశరాజు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ ఐ టి -ఐ ఎస్ ఎం) నుండి డాక్టర్ పీహెచ్డీ పట్టా పొందారు.కాశరాజు ఒకటవ తరగతి నుండి నాలుగో తరగతి వరకు తోడేళ్ల గడ్డ  గ్రామంలో విద్యను అభ్యసించారు. ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు కొండనాగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్ కొండనాగుల జూనియర్ కాలేజీలో.కాశరాజు డిగ్రీ బీఎస్సీ విద్యాభ్యాసం కూడా కొండనాగుల ఉమామహేశ్వర డిగ్రీ కళాశాలలో కొనసాగించారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో భూ భౌతిక శాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పట్టా పొందారు. పి జి తర్వాత హైదరాబాదులోని భూ భౌతిక పరిశోధన శాలలో (యన్ జి ఆరు ఐ) ప్రాజెక్టు అసిస్టెంట్గా చేరారు. భూ ఉపరితలంపై పరిశోధన ఆసక్తితో జాతీయ భూభౌతిక పరిశోధన శాలలోని ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్ పర్యవేక్షణలో పరిశోధన చేస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
సి ఐ ఎస్ ఎం .

 

 

Post Midle

ధన్బాద్ లో పీహెచ్డీ ప్రవేశం పొందాడు. మధ్య భారతంలోని భూపాల కల
కదలిక భూకంపాలు మరియు ప్రకృతి వనరులపై పరిశోధనలను ఐఐటి ధన్బాద్ నుండి పీహెచ్డీ పట్టా అందుకున్నాడు. కాశరాజు తన పరిశోధన పత్రాలను ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించాడు తన పరిశోధన సమయంలో
కాశరాజు  సి ఎస్ ఐ ఆర్ , మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ భారత ప్రభుత్వం నుండి మూడు సంవత్సరాలకు గాను సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్  అందుకున్నాడు. పరిశోధనలో పలు జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో దర్శించడం ద్వారా వీరికి గుర్తింపు వచ్చింది. వీరికి డాక్టర్ పీహెచ్డీ పట్టా పొందడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారికి అభినందించారు.

 

Tags: Todella Gadda Villager Doctorate

Post Midle

Leave A Reply

Your email address will not be published.