Natyam ad

వైఎస్సార్‌సీపీకీ అండగా … బలిజలు ఏకమై..

– రోజు ప్రచారాలు..

– మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో ప్రమాణం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు నియోజకవర్గంలోని బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు ఏకమైయ్యారు. తమ అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీకి పార్టీకి , మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభానికి అండగా ఉంటామని , రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకి వే సి, అందరిచేత వేయిస్తామని బలిజలు ముక్తకంఠంతో పేర్కొంటు ఈమేరకు ప్రమాణాలు చేసి, హామి ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ బలం మరింత పుంజుకుంది. సోమవారం రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని  రాష్ట్ర జానపదకళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగముని, నాగభూషణం, నాగేంద్ర, బలిజ సంఘ నేతలు నానబాల గణేష్‌, పూలత్యాగరాజు, రాయలజగదీష్‌, తుంగామంజునాథ్‌ , సుబ్రమణ్యంలు కలసి సమావేశానికి తీసుకెళ్లారు.

 

 

 

ఈ సందర్భంగా మహిళలు మంగళనీరాజనాలతో స్వాగతం పలికారు. సంఘ అధ్యక్షుడు నానబాలగణేష్‌ మాట్లాడుతూ బలిజల అభివృద్ధి కోసం కమ్యూనిటి భవనానికి నిధులు ఇవ్వడం, భీమగానిపల్లె వద్ద శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌ ఏర్పాటు చేయడం, బలిజల హాస్టల్‌కు స్థలం ఇవ్వడంపై బలిజలు సంతృప్తిగా ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోని బలిజలు ఐకమత్యంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారి కులదైవం సాక్షిగా ప్రమాణాలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ బలిజ కులస్తులను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వారిని రాజకీయంగా , ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు వైఎస్సార్‌సీపీకి వేయాలని కోరారు. ఈ సమావేశంలో బలిజ కులస్తులు సిడి.కృష్ణప్ప, నానబాలమణి, సుబ్రమణ్యం, నటరాజ, రామచంద్ర, కేశవమూర్తి, ప్రభాకర్‌, ఆదినారాయణ, ఎస్వీటి కిషోర్‌, సోము, రెడ్డెమ్మ, సుబ్బరాయప్ప, రవి, గోపి, సాగర్‌, సురేష్‌, రామకృష్ణ, భారతి, మురళి, కొండవీటి నరేష్‌, మాధురి  తదితరులు పాల్గొన్నారు.

Tags; Together with YSRCP…

Post Midle