నకిలీ బంగారంతో బ్యాంక్ కు టోకరా
గుంటూరు ముచ్చట్లు:
నకిలీ బంగారం తనఖా పెట్టి బ్యాంకు నుండి పలు దఫాలుగా మూడు ఖాతాలతో 38 లక్షలు భారీ రుణం పొందిన ముగ్గురు వారికి సహకరించిన మరో ముగ్గురు పై చేబ్రోలు, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజర్ సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని ఎస్ఐ వై.సత్యనారాయణ తెలిపారు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో నకిలీ బంగారం తనఖా పెట్టి 38 లక్షలు రుణం పొందిన మోసపూరిత ఘటనపై గురువారం చేబ్రోలు, ఠాణాలో ఎస్సై వివరాలు వెల్లడించారు. బ్యాంకు గోల్డ్ అప్రైజర్ సోమూజి బాబురావు.అతని తనయులు జయకృష్ణ, విజయ సూర్య దుర్గ ప్రసాద్ లు, స్నేహితులు కోడాల లీల అభిషేక్, సాంబ్రవ్ గోపి సాయి, బచ్చు అవినాష్ సాయంతో నకిలీ బంగారం అక్రమంగా కుదవబెట్టి 38 లక్షల రుణం పొందారని బ్యాంక్ మేనేజర్ సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ సత్యనారాయణ వెల్లడించారు.ఈ మేరకు అత్యవసర ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Tags: Tokara to the bank with counterfeit gold

