Natyam ad

అక్రమాల నియంత్రణకు టోల్ ఫ్రీ నంబర్ 14500 సేవలు-జిల్లా ఎస్పీ  కె.కె.ఎన్ అన్బురాజన్

కడప ముచ్చట్లు:

ఇసుక అక్రమ రవాణా, తదితర అక్రమాల నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు విభాగం వారి టోల్ ఫ్రీ నంబర్ 14500 సేవలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్   శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  ఎర్ర చందనం అక్రమ రవాణా, నాటు సారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా, గుట్కా, మట్కా, పేకాట, గంజాయి, కోడి పందేలు, తదితరాల కట్టడికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబరును ప్రారంభించారన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఈ అక్రమాలు జరుగుతుంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఉచిత ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. ఈ సేవలు వినియోగించుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేద్దామని ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్  పిలుపునిచ్చారు.

 

Post Midle

Tags: Toll Free Number 14500 Services for Control of Irregularities – District SP K.K.N Anburajan

Post Midle

Leave A Reply

Your email address will not be published.