కాంగ్రెస్ లో నేతల మధ్య టిక్కెట్లు లొల్లి…

Tolls among Congress leaders

Tolls among Congress leaders

Date:06/10/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నేతల మద్య టిక్కెట్ల పోటీ తీవ్రమైంది. గ్రూపుల మద్య ఆదిపత్య పోరు కొనసాగుతుండగానే టిక్కెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు డిల్లీ, హైదరాబాద్ లకు చక్కర్లు కొడుతున్నారు. తమకు దగ్గరుండే అగ్రనేతల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో చోటు చేసుకున్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని స్క్రినింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
సర్వే నివేదిక ఆధారంగానే టిక్కెట్ల పంపకం ఉంటుందని, దీన్ని అధినేత రాహుల్ గాంధే చూసుకుంటారని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కేటాయింపుపై స్తబ్దత నెలకొంది. అధికార టీఆర్ఎస్ అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా వారు ప్రచారంలో దూకుడు పెంచగా.. కాంగ్రెస్ టిక్కెట్ల పర్వం ఓ కొలిక్కి రాక ఆశావాహుల్లో నిస్తేజం అలముకుంటోంది. అయినా తమ ప్రయత్నాలను వదలకుండా అధిష్టానం వద్ద పైరవీలు కొనసాగిస్తూనే మరో వైపు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
నిర్మల్ నియోజకవర్గం నుంచి డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టిక్కెట్టు దాదాపు ఖరారైనట్లు ప్రచారం సాగుతుండగా..మిగిలిన నియోజకవర్గాల్లో టిక్కెట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆశావాహుల్లో ఉత్కంట పెరుగుతూనే ఉంది. ఏఐసిసి సూచనల మేరకు అభ్యర్థుల ఎంపికపై త్రిసభ్య కమిటీ రెండుసార్లు పరిశీలన జరపగా మరోసారి గెలుపు ఓటములు, సామాజిక సమీకరణలపై క్షేత్ర స్థాయిలో సర్వే జరపడం ఆపార్టీలో ఆసక్తి రేపుతోంది.
మరో వైపు టీఆర్ ఎస్ లో సీటు దక్కక కాంగ్రెస్ లోకి వలసలు పెరగడం ఆశావాహులు, సీనియర్లలో అసంతృప్తి రాజుకుంటోంది. తమను గుర్తించకపోతే తిరుగుబావుటా తప్పదని వారు బాహాటంగానే అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు బోథ్ ఎస్టీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు, నియోజకవర్గ ఇంచార్జి అనీల్ జాదవ్, నరేశ్ జాదవ్, కుమ్రం కోటేశ్ లు ప్రధానంగా పోటీ పడుతున్నారు.
ముధోల్ నియోజవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, రామారావు పటేల్, విజయ్ కుమార్ లు టిక్కెట్ ఆశిస్తుండగా అధిష్టానం నారాయణరావు పటేల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అనూహ్య పరిణామాలు చోటు చుకుంటే తప్ప దాదాపు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరికి టిక్కెట్ ఖరారు చేసేందుకే అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే టిక్కెట్లు ఖరారై జాబితా వెలువడే వరకు జిల్లాలో నేతల్లో ఉత్కంఠకు తెరదిగే అవకాశాలు కనిపించడం లేదు.
Tags:Tolls among Congress leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *