ఏపీలో స్టూడియోలకు దూరంగా టాలీవుడ్

విశాఖపట్టణం ముచ్చట్లు:

తెలుగు చిత్ర సీమకు,రాజకీయ చుట్టరికం కొత్త విషయం కాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’ లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, చాలా మంది  నటీ నటులు, రాజకీయ అరంగేట్రం చేశారు. పాత తరం హీరో కంమ్ విలన్  కొంగర జగ్గయ్య మొదలు నట శేఖర కృష వరకు కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి పార్లమెంట్’ లో అడుగు పెట్టారు. అలాగే హీరోయిన్లలో జమున కూడా కాంగ్రెస్ ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అలాగే, వాణిశ్రీ, వంటి ఇంకొందరు  ప్రముఖ నటీనటులు చట్టసభల్లో కాలు పెట్టక పోయినా కాంగ్రెస్ పార్టీలో, అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలలో క్రియాశీలక పాత్రను పోషించారు. ఎర్ర సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచినా మాదాల రంగా రావు,  కమ్యూనిస్ట్ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించారు.  అలాగే అల్లు రామలింగయ్య చివరి వరకు, సిపిఎం పార్టీకి ప్రతి సంవత్సరం ‘సెస్’ ( చందా)  ఇచ్చేవారని అంటారు. ఇక, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, అన్న ఎన్టీ రామ రావు స్థాపించిన తెలుగు దేశం హయాంలో అయితే చెప్పనే అక్కరలేదు. ఆది సినిమా రాజకీయ అనుబంధానికి స్వర్ణ యుగం అని చెప్పవచ్చును. ఆ కాలంలో  ఎందరో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఒకరని కాదు 24 ఫ్రేమ్స్  కు చెందిన అనేక మంది సినిమా ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలలో క్రియాశీల భూమికను పోషించారు.

 

 

 

Post Midle

తెలుగు దేశం టికెట్ పైన, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. బాబూ మోహన్ వంటి ఒకరిద్దరు మంత్రులుగానూ ఓ వెలుగు వెలిగారు.నిర్మాత రామానాయుడు, నటీ నటులు నందమూరి బాల కృష్ణ, హరికృష,  మురళీ మోహన్, సత్యనారాయణ, రావు గోపాల రావు, బాబు మోహన్, కోట శ్రినివాస రావు, శారద, జయ ప్రద, జయ సుధ, కే . రోజా, ఇంకా అనేక  మంది తెలుగు దేశం పార్టీ వేదిక నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలు మారినా ఇప్పటికీ కొందరు క్రియాశీలంగా, కీలక పదవుల్లో ఉన్నారు.  అలాగే రెబెల్ స్టార్ క్రిషన్ రాజ, కోట శ్రీనివాస రావు, నరేష్ వంటి చాలా మంది నటీనటులు బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరించారు. కృష్ణం రాజు అయితే, వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మత్రిగా పనిచేశారు. అదే విధంగా  మెగా స్టార్  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానూ కొందరు, నటీ నటులు సినీ ప్రముఖులు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. అయితే, చిరంజీవి అతి తక్కువ కాలంలోనే ప్రజారాజ్యం దుకాణం మూసి వేయడం వల్లనో ఏమో తమ్ముడు, పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణ మురళీ తప్పించి పెద్దగా సినిమా వాళ్ళు చిరంజీవితో చేయి కలపలేదు. కలిసి నడవలేదు. చివరకు తమ్ముడు పవన్ కళ్యాణ్’ కూడా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించి,వేరు కుంపటి(జనసేన) పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సినిమా వాళ్ళకు పొలిటికల్ ప్యాట్రనేజ్ పెద్దగా దక్కడం లేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా వాళ్ళను కూరలో కరివేపాకులా వాడుకుని  వదిలేస్తున్నారు. అంతే కానీ, వారికి సముచిత స్థానం ఇవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,

 

 

 

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించిన విజయ శాంతి మొదలు నిన్నమొన్న ఇట్లా దగ్గర చేసి అట్లా పక్కన  పెట్టిన ప్రకాష్ రాజ్ వరకు  ఎవరికీ కాసింత గౌరవం ఇచ్చింది లేదు. అందరి విషయంలోలానే సినిమా వాళ్ళ విషయంలోనూ కేసీఆర్, యూజ్ అండ్ త్రో’ పద్ధతినే పాటించారని  అంటారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి, సినిమా హీరోలను జీరోలుగా చేసిన, ‘ఘనత’ జగన్ రెడ్డికే దక్కింది. సినిమా టికెట్ ధరల చుట్టూ వివాదాన్ని సృష్టించి, వివాదం పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం  సినిమా రంగం పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పింది. అదే విధంగా రాజకీయ పదవుల విషయంలోనూ జగన్ రెడ్డి, చిరంజీవి మొదలు అలీ వరకు, మోహన్ బాబు  మొదలు పోసాని కృష్ణ మురళీ, వరకు ప్రతి ఒక్కరితో ఒకే విధంగా ఆడుకున్నారనే టాక్  టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అందుకే, ఇంతవరకు ఏవో ఆశలతో, వైసీపే కండువా కప్పుకుని, జగన్ రెడ్డిని నెత్తిన మోసిన, పెద్దల ఆశలు మంచులా కరిగి పోయాయని, ఇంకొందరేమో, జగన్ రెడ్డి ని మోసి నందువలన తమకు దక్కింది ఏమీ లేక పోగా సినిమాల్లోనూ అవకశాలు రావడం లేదని అ వాపోతున్నారు.అందుకే జగనన్నా నీకో దండం అంటున్నారు.  అదలా ఉంటే  రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్దికి అవకాశాలున్నా, సినిమా  రంగం అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చిన్న చూపని, అర్థమయింది కాబట్టే, స్టుడియోల నిర్మాణానికి ఫ్రీ ల్యాండ్ సహా ఇతర సదుపాయాలు కలిపిస్తామని చెప్పినా, ఎవరూ ముందుకు రావడం లేదని, అంటున్నారు.

 

Tags: Tollywood away from studios in AP

Post Midle
Natyam ad