టమాటా 31

Date:15/04/2019
 తిరుపతి ముచ్చట్లు:
మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు పుంజుకున్నాయి.సోమవారం మార్కెట్‌లో నాణ్యమైన టమోటా కిలో రూ.31.20 వరకు పలికింది. గత మూడు రోజులుగా కిలోపై రూ.10 చొప్పున పెరుగుతూ వస్తోంది. 10వ తేదీ మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా రూ.21 పలుకగా.. ప్రస్తుతం అత్యధిక ధర పలకడంతో రైతుల కష్టానికి కొంత ఊరట కలిగింది. మార్చి నెలాఖరు నుంచి ఇక్కడి మార్కెట్‌ సీజన్‌ ప్రారంభమౌతుంది. వేసవికాలంలో బయట ప్రాంతాల్లో టమోటా సాగు పెద్దగా ఉండదు. చిత్తూరు జిల్లా పశ్చిమాన ఈ పంటను బోరు బావుల కింద సాగు చేస్తారు. దీంతో ఇక్కడి టమోటాకు సీజన్‌గా పరిగణిస్తారు. బయటి రాష్ట్రాల్లో దిగుబడులు లేకపోవడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతుంది. ఈ కారణంగా ధరలు పుంజుకుంటున్నాయి. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, కర్ణాటక సరిహద్దులోని రాయల్‌పాడు, శ్రీనివాస్‌పురం సరిహద్దు గ్రామాల నుంచి రైతులు మార్కెట్‌కు టమోటా తీసుకొస్తున్నారు. శనివారం 206 టన్నుల టమోటాను తీసుకువచ్చారు. నాణ్యమైన ఏ గ్రేడ్‌ కాయలు కిలో రూ.20 నుంచి రూ.31.20 వరకు, బి.గ్రేడ్‌ కిలో రూ.8 నుంచి అత్యధికంగా రూ.19.40 వరకు పలికాయి. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలకు, తమిళనాడులోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లకు టమోటాలను ఎగుమతి చేస్తున్నారు.
Tags: Tomato 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *