Tomato and potato prices fall

టమోటా, ఉర్లగడ్డ ధరలు పతనం

– పదిహేనుకిలోలు రూ.130లు
– కిలో రూ. 8లు
– తగ్గిన పంట

Date:18/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

టమోటా, ఉర్లగడ్డ ధరలు లేకపోవడంతో రైతుల ఆశలు నిరాశలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత పది రోజులుగా టమోటాలు స్థానికంగా రాకపోవడం, బయట ప్రాంతాలకు చెందిన టమోటాలు మార్కెట్‌ కమిటికి రావడంతో ధరలు పతనమైందంటున్నారు. పదిహేను కిలోల వెహోదటి రకం బాక్సు ధర రూ. 130లు , రెండవరకం రూ.110లకు విక్రయాలు జరిగాయి. పుంగనూరు మార్కెట్‌ కమిటికి కేవలం 200 బాక్సుల టమోటాలు స్థానిక రైతులు తీసుకొచ్చారు. కాగా కూరగాయాలలో మార్కెట్‌లలో మాత్రం కిలో టమో• ధర రూ.10 నుంచి రూ.13 వరకు విక్రయిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను సుమారు 75 హెక్టార్లలో మాత్రమే టమోటా పంటను పండించారు.అలాగే మండలంలో సుమారు 30 హెక్టార్లలో ఉర్లగడ్డ పంటను పండించారు. ఎకరా ఉర్లగడ్డ పంట పండించేందుకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే టమోటా పంటలను పండించేందుకు సుమారు రూ.40 వేలు ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు తెగుళ్ల నుంచి కాపాడేందుకు ఎరువులకు, విత్తనాలకు కలసి అదనంగా ఎకరాకు మరో రూ.20 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవల టమోటాకు ఊజి పురుగుల బెడద, ఉర్లగడ్డకు ఆకుతెగులు అధికమై టమోటా, ఉర్లగడ్డ పంటలు రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చి కన్నీళ్లే మిగిల్చింది. దీని కారణంగా రైతులు టమోటా, ఉర్లగడ్డ పంటలపై ఆశలు వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సుమారు 900 ఎకరాలలో టమోటా పంటను, 200 హెక్టార్లలో ఉర్లగడ్డలను సాగు చేసిన రైతులు ఈ సారి 75 హెక్టార్లకే టమోటాను పరిమితం చేశారు. ఉర్లగడ్డ పంటను కేవలం 30 హెక్టార్లలో పండించారు.

పతనమైన కూరగాయల ధరలు….

రైతులు పండించిన కూరగాయల ధరలు కూడ పతనమైంది. ఆలుగడ్డ కిలో రూ.16, కాలిప్లవర్‌ కిలో రూ.4లు , కొత్తిమీర కట్ట రూ.10లు, పచ్చిమిర్చి కిలో రూ.25లు, బీన్స్కిలో రూ.10, దోసకాయలు కిలో రూ.4లు కావడంతో రైతులు పంటలను తీసుకుని మార్కెట్‌కు వెళ్లేందుకు కూడ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. బీన్స్, ఆలుగడ్డ మాత్రం మార్కెట్‌కు తరలించి, వచ్చిన డబ్బును తీసుకుంటున్నారు. కాలిప్లవర్‌ పంటలను వదిలివేశారు. అలాగే కొత్తిమిర, పచ్చిమిర్చిని అలాగే వదిలి వేసి ఎండుమిర్చి, దనియాలు పండించుకుంటే ధరలు లభిస్తుందని రైతులు ఆశ పడుతున్నారు.

టమోటాతో కష్టాలే…

టమోటా పంటను ప్రస్తుతం మూడు ఎకరాలలో వేశాను. పంట చేతికొచ్చే సమయంలో ఊజి పురుగులు టమోటాను నాశనం చేస్తున్నాయి. అలాగే దానిని నుంచి కాపాడి పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే ధరలు లేకపోతోంది. ఎకరాకు సుమారు రూ.40 వేలు ఖర్చు చేసి పంటలు పండించినా అప్పులే మిగులుతోంది. ప్రభుత్వం టమోటాలను కొనుగోలు చేసి విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.

– పి.అయూబ్‌ఖాన్‌, రైతు, పుంగనూరు.

ఏ పంట చేసిన నష్టాలే…

రెండు ఎకరాలలో ఉర్లగడ్డ పంటను పండించాను. ఇందుకు గాను రూ.3.50 లక్షలు ఖర్చు చేశాను. ఉర్లగడ్డలు 40 కేజిల బస్తాలు 200 బస్తాలు వచ్చింది దీనిని చెన్నై మార్కెట్‌కు తరలించగా రూ.1.55 లక్షలు వచ్చింది. ఉర్లగడ్డల్లో రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఉర్లగడ్డలను కొనుగోలు చేసి విక్రయించాలి.

– ఎం.నారాయణప్ప, రైతు, కుమ్మరగుంట.

 

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

Tags: Tomato and potato prices fall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *