10 రూపాయిలకు చేరిన టమాట

నిజామాబాద్ ముచ్చట్లు:
 
నాలుగైదు రోజులుగా టమాట ధరలు దిగజారిపోతున్నది.దీంతో స్థానికంగా ఆ పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తున్న దశలో ధరలు తగ్గుతుండంతో నష్టపోతున్నామనే ఆవేదన వ్యక్తమవుతున్నది. తగ్గుతున్న ధరతో రైతుకు ఐదారు రూపాయలకు మించి రావడం లేదు. ఇది కొంత వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నప్పటికీ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోవడంతో సప్లరు పెరిగింది. డిమాండ్‌ తక్కువ కావడంతో ధరలు పతనావస్థకు చేరుకున్నాయి. కిలో టమాట ధర వంద రూపాయలు పలికిన సమయంలో రైతులకు మాత్రం రూ. 40 రూపాయలకు మించి ఇవ్వలేదు. రైతుల నుంచి తక్కువ ధరకు సేకరించి నిల్వ చేసుకుని ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌కు తెచ్చిన రైతులకు బాక్స్‌ (25కిలోలు) రూ 70 నుంచి రూ 80 పలుకుతున్నది. అంతా కిలో సగటు మూడు రూపాయలకు మించి రావడం లేదు. కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదు. దీంతో ఇదే సమయంలో రిటైల్‌ మార్కెట్‌లో ధరల తగ్గుదల నమోదైంది.గతేడాది కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమాట పంట పూర్తిగా నాశనమైంది. దీంతో పంట రాకపోవడంతో నవంబర్‌, డిసెంబర్‌లో టమాట ధర సెంచరీ దాటింది. ఆ తర్వాత వానలు వెనకపట్టు పట్టడంతో రైతులు టమాట సాగుపై దృష్టి సారించారు. అయితే పంట చేతికొచ్చే క్రమంలో ధరలు తగ్గుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ధర బాగా ఉన్నప్పటికీ పంట రాలేదు. ప్రస్తుతం అది వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ధర తగ్గుముఖం పట్టింది. టమాట ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తున్నది.
 
 
 
 
ఇటీవల అశ్వారావు పేటలో ఒక రైతు ధర లేకపోవడంతో రూ 75వేల విలువైన టమాట చెత్తకుప్పలో పారబోసిన విషయం తెలిసిందే.రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు పొటెత్తుండటంతో టమాట ధరలు పడిపోతున్నాయి. కడప, కర్నూల్‌, చిత్తురు జిల్లాలోని మదనపల్లిలో టమాటకు అనువైన ప్రాంతం. అక్కడి నుంచే ఎక్కువగా మన రాష్ట్రానికి దిగుమతి అవుతున్నది. ప్రతి రోజు హైదరాబాద్‌ నగరానికి ఐదువందల టన్నుల నుంచి ఏడు వందల టన్నుల దాకా దిగుమతి అవుతున్నది. బెంగళూరు టమాట కూడా వస్తున్నది. ఈ ప్రవాహంలో స్థానిక రైతులు నష్టపోతున్నారు.టమాట ధరలు తగ్గినా మిగతా కూరగాయల ధరలు మాత్రం తగ్గలేదు. బీరకాయ, వంకాయ, గోరుచిక్కుడు ధరలు భారీగా పెరిగి పోయాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో బీరకాయ కిలో రూ. 70, వంకాయ కిలో రూ.40, గోకరకాయ కిలో రూ. 50,బెండకాయ కిలో రూ. 50, బీన్స్‌ కిలో రూ. 80 రూపాయలు పలుకుతున్నది. కూరగాయల పంట డిమాండ్‌కు తగినట్టు రాకపోవడంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి లాభాలు పొందుతున్నారు.కుప్పలు పెట్టి అమ్ముకుంటున్నఒక మడి టమాట పంట వేసిన. కాపు బాగా వచ్చింది. చెట్టుకు పదిహేను కాయలు పట్టినయి. కానీ ధర లేదు. ఊర్లో కుప్పలు పెట్టి అమ్ముకుంటున్న. కుప్పకు పది రూపాయలకు మించి రావడం లేదు.మల్లమ్మ రైతు, గ్రామం ముధ్విన్‌, మండలం కడ్తాల్‌ హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు జనం పోతున్నారు. కొనేవారే కరువయ్యారు. దీంతోపాటు మదన పల్లి, బెంగళూరు నుంచి టమాట బాగా వస్తుంది. దీంతో టమాట ధరలు తగ్గాయి. రెండు,మూడు రోజుల్లో మళ్లీ ధరలు పెరుగుతాయి.
 
Tags: Tomato for 10 rupees

Leave A Reply

Your email address will not be published.