రైతులకు కోసం టామోటా నర్సరీ
పుంగనూరు ముచ్చట్లు:
ఉధ్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన టమోటా, వంగ, కాకర, భీర, సొరకాయ, అంటుకట్టిన పలు రకాల నర్సరీ వెహోక్కలను పంపిణీ చేయనున్నట్లు ఉధ్యానవనశాఖాధికారి వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కుప్పంలో సెంటర్‌ఫర్‌ఎక్స్లెన్స్ నందు మేలురకం టమోటా వెహోక్కలు 20 పైసలకే ఒకొక్క వెహోక్కను అందించనున్నట్లు తెలిపారు. పెద్దపంజాణి మండలం రాజుపల్లెకి చెందిన మంజునాథ్‌రెడ్డి అనే రైతుకు ఈ వెహోక్కలను అందించడంతో తక్కువ ఖర్చుతో టమోటా పంటను సాగు చేశారన్నారు. రైతులకు అందుబాటులో అన్ని రకాల వెహోక్కలను అందిస్తామన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Tags; Tomato nursery for farmers
