పుంగనూరులో కోనసీమకు రూ.3 లక్షల విలువ చేసే టమోటాలు విరాళం
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కోనసీమలోని అమలాపురం వరదబాధితులకు రూ.3 లక్షలు విలువ చేసే టమోటాలు పంపారు. శ నివారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో టమోటా మండి వ్యాపారులందరు కలసి తమ వంతు విరాళంగా ప్రత్యేక లారీలో టమోటాలను తరలించారు. చైర్మన్ నాగరాజారెడ్డి మాట్లాడుతూ సుమారు 270 బాక్సుల టమోటాలను అందరి సహకారంతో అమలాపురం వరదబాధితులకు పంపిణీ చేసేందుకు తరలించామన్నారు. బాధితులకు సహాయంగా తమ వంతు విరాళాన్ని పంపామన్నారు. ప్రతి ఒక్కరు కోనసీమ బాధితులకు తమవంతు విరాళాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టమోటామండి వ్యాపారులు రెడ్డెప్పరెడ్డి, రాజారెడ్డితో పాటు వై ఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్ధూర్ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు.
Tags: Tomatoes worth Rs.3 lakhs donated to Konaseema in Punganur