Sri Nirisimha Jayanti on May 17th

రేపే పొన్నకాల్వ ఉత్సవం

Date:18/04/2019

తిరుమల ముచ్చట్లు:

శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 19.4.2019  నాడు పొన్నకాల్వ ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతియేటా చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి (చిత్రాపౌర్ణమి) నాడు పొన్నకాల్వ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 3.00 గంటలకు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు జరిపి 5.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, కృష్ణ స్వామి మరియు ఆండాళ్ అమ్మవారు, సేనాధిపతి వారు వేర్వేరు తిరుచ్చిలపై వేంచేపు చేసుకొని ఉత్సవంగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు. అక్కడ 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు స్నపన తిరుమంజనము నిర్వహించనున్నారు. తరువాత 10.00 గంటల నుండి11.00 గంటల వరకు అలంకరణ, సేవాకాలం, సాత్తుమొర నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 to 5.30 pm వరకు పొన్నకాల్వ మండపంలో ఊంజల్ సేవ తదుపరి 5.30 గంటలకు బయలుదేరి తిరుచానూరు సన్నిధి వీధిగుండా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందుకు చేరుకునే సమయంలో అక్కడ మహద్వారం యొక్క ఒక తలుపును మూస్తారు (శ్రీ పద్మావతి అమ్మవారు తన బావగారైన శ్రీ గోవిందరాజస్వామివారిని మూసిన తలుపుచాటు నుంచి చూస్తుంది అని ఐతిహ్యం). తరువాత తిరుచానూరు నుంచి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 9.00 గంటలకు మధురకవి ఆళ్వార్ చివరి రోజు ఉత్సవం (సాత్తుమొర), ఆ తర్వాత పౌర్ణమి సందర్భంగా పూలంగి సేవ, రాత్రి కైంకర్యాలు అనంతరం అర్దరాత్రి 12.00 గంటలకు ఏకాంత సేవ నిర్వహించనున్నారు.

 

స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు

 

Tags:Tomorrow Ponnakavela festival

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *