రేపు అరవింద సమేత ఆన్ లైన్ సాంగ్స్ 

Tomorrow's aired on-line songs

Tomorrow's aired on-line songs

Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఈనెల 20 విడుదల కానుంది. అయితే ఎప్పటిలా ఫంక్షన్ చేయ కుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఈ పాటలను విడుద ల చేయాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ‘‘అరవింద సమేత’ ఆడియోను సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం జరుగుతుంది’’ అని తెలిపింది.
జగపతిబాబు, సునీల్, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Tags:Tomorrow’s aired on-line songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *