పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు వివిధ రకాల పనిముట్లను ఆదివారం పంపిణీ చేయనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ శనివారం తెలిపారు. రాంపల్లెలో గల లయన్స్ క్లబ్ కార్యాలయంలో సుమారు రూ.5 లక్షలు విలువ చేసే కుట్టుమిషన్లు, చిరువ్యాపారులకు గొడుగులు, వీల్‌చైర్లు, వృద్ధాశ్రమాలకు , హాస్పిటల్స్, గురుకుల పాఠశాలలకు బెడ్‌షీట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే పదోతరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: Tools were distributed by the Lions Club at Punganur on 4th