తెలుగు అగ్రశ్రేణి.. సినీ దర్శకుడు.. కె.విశ్వనాథ్ కన్నుమూత
* సీఎం అశ్రు నివాళి.
అమరావతి ముచ్చట్లు:

ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించడంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చాన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యమంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసకువచ్చాయన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఆయన చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు. విశ్వనాథ్ మహాభినిష్క్రమనం తెలుగు సినీరంగానికి గొప్ప లోటని సీఎం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ పేరుమీద రాష్ట్రప్రభుత్వం లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును విశ్వనాథ్‌గారికి ఇచ్చిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Tags: Top Telugu movie director K. Vishwanath passes away
