Natyam ad

వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  నామినేషన్ దాఖలు

రాప్తాడు ముచ్చట్లు:

2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాప్తాడు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా   తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  రాప్తాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయు సందర్భంగా రాప్తాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ ప్రజలకు గత పాలనలో అందిన అభివృద్ధి-సంక్షేమం అలానే కొనసాగాలంటే  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ని మరొక్కసారి ఎమ్మెల్యే గెలిపించుకుని, జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పెద్దా ర్యాలీగా మండల తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ  మంగమ్మ , వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వచ్చారు.

Post Midle

Tags: Topudurthi Prakash Reddy filed nomination as YCP MLA candidate

Post Midle