Natyam ad

నెల్లూరు నగరంలో కుండపోత  వర్షం

నెల్లూరు ముచ్చట్లు:


అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో నెల్లూరు నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఆత్మకూరు బస్టాండు, మినీ బైపాస్ రోడ్డు, బీవీనగర్, పడారుపల్లి, ఇందిరమ్మ కాలనీ, బుజబుజ నెల్లూరు, వేదాయపాలెం, ట్రంకు రోడ్డు, పొదలకూరు రోడ్డు, శాంతినగర్, కొత్తూరు, మూలపేట, రంగనాయకులపేట స్టోన్ హౌస్ పేట, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఆత్మకూరు బస్టాండు ,విజయ్ మహల్ గేటు, రామ్మూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షంతో ప్రజలు, రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో వాహనాలు చిక్కుకొని ఆగిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

 

Tags: Torrential rain in Nellore city

Post Midle
Post Midle