తిరుమల తిరుపతిలో కుండపోతగా వర్షాలు
తిరుమల లో ఎడతెరిపి లేకుండా వర్షం…. అప్రమత్తంగా టీటీడీ
కొండ చరియలు విగిపడే అవకాశాలు…
ఘాట్ రోడ్లలో భక్తులు జాగ్రత్త గా వెళ్లాలి..టిటిడి
తిరుపతి లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయం
తిరుమల ముచ్చట్లు:
అకాల వర్షాల కారణంగా తిరుమలలో కుండపోత వర్షం కురుస్తుంది శ్రీవారి దర్శనానికి వెళ్ళిన భక్తులు నానా అవస్థలు పడుతున్నారు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ గదులు కాటేజీలు దొరకని భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గదుల నుంచి దర్శనానికి వెళ్లేటటువంటి భక్తులు కూడా వర్షంలోనే తడుస్తూ పరుగులు పెడుతున్నారు. స్వామి వారి దర్శనం ప్రస్తుతం దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంద్న నేపథ్యంలో ఆలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చిన భక్తులు వర్షంలో తడుస్తూనే వెళ్లాల్సిన పరిస్థితి. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షపు నీటితో నిండిపోయాయి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగానే ఈ పరిస్థితని అధికారులు కూడా చెబుతున్నారు. ఘాట్ రోడ్లలో సైతం కొండకి వెళ్లే భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని టిటిడి సూచిస్తుంది గతంలో ఘాట్ రోడ్ల లో కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యం లో టీటీడీ కూడా భద్రతను మరింత కట్టు చట్టం చేసింది. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికార యంత్రంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక తిరుమల లో ఆ రకంగా కుండపోత వర్షం కురుస్తుంటే ఆ ప్రభావం తిరుపతిలోనూ తీవ్రంగా ఉంది తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తిరుపతి కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు స్థానిక ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.

Tags: Torrential rains in Tirumala Tirupati
