మున్సిపాలిటిలో మొత్తం ఓటర్లు: 38,656

Total voters in the municipality: 38,656

– మహిళలు 19,761
– బీసీలు 20,977

Date:05/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని 24 వార్డుల్లో 2019 జూన్‌ 4 నాటికి మొత్తం 38,656 ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,761 మంది మహిళలు ఉన్నారు. అలాగే బీసీ ఓటర్లు 20,977 మంది ఉన్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మదుసూదన్‌రెడ్డి మంగళవారం ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు గత పది రోజులుగా పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ , బీసీ , మహిళా ఓటర్ల జాబితాను ఇంటింటికి వెళ్లి మున్సిపల్‌ సిబ్బంది నిర్వహించారు. గణన జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు మున్సిపాలిటిలో ముస్లింలు , ఇతర బీసీ కులాలు కలిపి 20,977 ఓటర్లు ఉన్నారు. వీరిలో లు 10,742 మంది ఉన్నారు. పురుషులు 10,235 మంది ఉన్నారు. అలాగే ఓసీ ఓటర్లలో పురుషులు 7098 మంది , లు 7186 , ఇతరులు ఇద్దరు ఉన్నారు. అలాగే ఎస్సీ ఓటర్లు పురుషులు 1426 మంది, స్త్రీ లు 1678 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు పురుషులు 134 మంది, లు 155 మంది ఉన్నారు. ఇలా ఉండగా మహిళలు అధికశాతం కలిగి ఉండటంతో మున్సిపాలిటిలోని 24 వార్డుల్లో సగం వార్డులను మహిళలకు కేటాయించనున్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల మేరకు సగం వార్డుల్లో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించనున్నారు. ఇలా ఉండగా రిజర్వేషన్లతో సిట్టింగ్‌ కౌన్సిలర్లకు ఎక్కువ మందికి సీట్లు దక్కే అవకాశాలు తక్కువుగా ఉండటంతో నాయకులు వార్డులు మారేందుకు సైతం సిద్దమౌతున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పొందేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించారు.

 

భక్తిశ్రద్దలతో రంజాన్‌ వేడుకలు

 

Tags: Total voters in the municipality: 38,656

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *