నత్త నడకన తోటపల్లి ఎడమ కాలువ పనులు..
శ్రీకాకుళం ముచ్చట్లు:
పాలకొండ నియోజకవర్గం తోటపల్లి ఎడమ కాలువ పనులు గత నాలుగు సంత్సరాలుగా నత్త నడక నడుస్తున్నాయి. ఈ పనులుతో రైతులు నాలుగు సంత్సరాలు నుంచి ఏ ఒక్క సంత్సరం కూడా వేసవి పంట పండించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పాడి రైతులు ఇబ్బందులు పడటమే కాకుండా, నీరు లేకపోతే ఏ ఒక్క పంట పండించుకోలేకపోతున్నామని, రైతులు వాపోయారు. కనీసం కూలి పనులు కూడా చేసుకోవడానికి పనులు దొరకక గ్రామలన్ని విడిచి వలస వెళ్ళే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి రైతులకు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జనసేన నాయకులు జానీ డిమాండ్ చేశారు.
Tags: Totapalli left canal works at Nattha Walk..

