ఎన్నికల విధులపట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

Tough actions are ignored for electoral functions

Tough actions are ignored for electoral functions

Date:15/03/2019
ములుగు ముచ్చట్లు:
ఎన్నికల విధుల పట్ల నిర్లక్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సెక్టరీల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ పై సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న తప్పు జరిగిన ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలింగ్ స్టేషన్ల లో కనీస మౌలిక సదుపాయాలను ముందస్తుగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సెక్టార్ రూట్లలో వాహనాలు వెళ్లేందుకు రోడ్ల పరిస్థితి అనుకూలంగా వుండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. టెలిఫోన్ కనెక్టివిటీ కి అర్యంత ప్రాధాన్యత కల్పించి కమ్యూనికేషన్ వ్యవస్థ ను పటిష్ట పరుచుకోవలన్నారు. ఎస్ హెచ్ వోలు,  రెవిన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లన్నీ పక్కాగా చూసుకోవాల్సిన భాద్యత సెక్టోరియల్ అధికారులదేనని అన్నారు. పోలింగ్ స్టేషన్స్ వారీగా రూట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో ఆర్డీవో రమాదేవి, డీసీవో కరుణ సాగర్, సబ్ రిజిస్ట్రార్  తస్లీమా, డీఆర్డీవో సంజీవరావు, ఏపీఎం గోవింద్ చౌహన్, స్త్రీ నిధి రీజినల్ కోఆర్డినేటర్ అరుణ్ సింగ్ , సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.
Tags:Tough actions are ignored for electoral functions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *