విశాఖ కార్పోరేటర్లకు టూరు కష్టాలు

విశాఖ ముచ్చట్లు:


స్టడీ టూర్ నిమిత్తం ఉత్తర భారత దేశంలోని మున్సిపాలిటీల్లో పర్యట నకు వెళ్లిన పలువురు విశాఖ జీవీ ఎంసీ కార్పొరేటర్లు కులూమనాలిలో చిక్కుకుపోయారు. మనాలిలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిప డటంతో స్టడీ టూర్ కోసం వెళ్లిన కార్పొరేటర్లు అక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వారు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యుల తో కలిసి పలువురు కార్పొరేటర్లు ఇటీవల స్టడీ టూర్కు వెళ్లారు. కులు మున్సిపాలిటీలో పలు ప్రాంతాలను కార్పొరేటర్లు సందర్శించారు. అనంతరం కొందరు కార్పొరేట్లరు మనాలిలో ఉండగా.. మరికొందరు గత రాత్రి మనాలి నుంచి చండీగఢ్కు బయలుదేరారు. ఆ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. వారు ఏటూ వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో గత రాత్రి నుంచి కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు రోడ్డు మీదే కాలం గడు పుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్లు చండీగఢ్కు 170 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయారు.ఇక, సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఇతర సిబ్బంది రంగంలోకి దిగింది. అయితే వర్షం పడుతుండటంతో సహాయక చర్యలను చేపట్టేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. కులుమనాలి మార్గంలో చిక్కుకున్న విశాఖ కార్పొరేటర్లు సురక్షితంగా బయట పడడానికి సహకరించిన ఉత్తరాఖండ్.. ఆర్మీ అధికారులకు  విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags: Tour difficulties for Visakha corporators

Leave A Reply

Your email address will not be published.