Tourism meal for Kovid hospitals

కోవిడ్‌ ఆస్పత్రులకు టూరిజం భోజనం

-సందర్శకులకు అందుబాటులో పర్యాటక కేంద్రాలు
-ఆలయాల ప్యాకేజీలు ప్రారంభం
-టూరిజం డీవీఎం సురేష్‌కుమార్‌రెడ్డి

Date:19/09/2020

తిరుపతి ముచ్చట్లు:

కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారికి పర్యాటకశాఖ ద్వారా భోజనం అందిస్తున్నామని ఆ శాఖ తిరుపతి డివిజనల్‌ మేనేజర్‌ ఆర్‌వీ.సురేష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో పర్యాటక పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ రుయా, మెటర్నటి, మాధవం, ఆయుర్వేద కోవిడ్‌ ఆస్పత్చ్రు కు టిఫిన్‌, బోజనం, స్నాక్స్, టి అందిస్తున్నట్డు చెప్పారు.కోవిడ్‌తో పర్యాటకశాఖ ఉద్యోగులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ పనులు చేపట్టామని చెప్పారు. దీనికి అవసరమైన మెటిరియల్‌ను టిటిడి, రెవెన్యూశాఖలు సరఫరా చేస్తుండగా వండిన భోజనాన్ని రవాణా చేసి అందిస్తున్నట్టు చెప్పారు. దీనికి ఒక రోగికి రోజుకు రూ.65 ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అమలులోని ఆలయాల సందర్శన ప్యాకేజీలను పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ఆలయాలను భక్తులు సందర్శించుకునే విధంగా ప్యాకేజీలు అందిస్తామన్నారు. టిటిడి భక్తుల సంఖ్య పెంచాక అంతర్‌రాష్ట్ర ప్యాకేజీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. జిల్లాలోని పర్యాటక కేంద్రాలను సందర్శకులు సందర్శించవచ్చని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించేవారినే అనుమతి ఉంటుందన్నారు. జిల్లాలో హార్సిలీహిల్స్ యూనిట్‌ మినహా మిగిలిన యూనిట్లలో ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు. పర్యాటక ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సందర్శకులకు విషయంలో అతిజాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఎస్‌ఓపీ మేరకు కోవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ సందర్శకులకు గతసౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కోవిడ్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులకు 100శాతం, సాధారణ ఉద్యోగులకు 50శాతం వేతనాలు అందుతున్నాయని చెప్పారు. కాగా హార్సిలీహిల్స్లో అమలు చేస్తున్న కోవిడ్‌ నిబంధనలను అమలు చేస్తూ ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జూన్‌ నుంచి ఇప్పటి వరకు రూ.40లక్షల ఆదాయం వచ్చిందన్నారు. తిరుపతి ర వాణా యూనిట్‌ ప్రారంభమైతే ఆదాయం భారీగా పెరుగుతుందని వివరించారు. హార్సిలీహిల్స్ వచ్చే సందర్శకులు మాస్కు, శానిటైజర్‌, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అతి•గృహల్లో వీరికి మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించకుండా స్పష్టమైన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.

తంబళ్లపల్లెకు రూ.170 కోట్ల భరోసా

Tags: Tourism meal for Kovid hospitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *