పర్యాటక ప్రాంతాలు నాశనం అవుతున్నాయి
విశాఖపట్నం ముచ్చట్లు:
పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి పేరుతో ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలను సీఎం జగన్ నాశనం చేస్తున్నారని విశాఖ జనసేన నాయకులు కోన తాతారావు ఆరోపించారు.అందాల మణిహారం ఋషికొండను రీడెవలప్మెంట్ పేరుతో నాశనం చేశారని,ఋషికొండలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని,విజయసాయిరెడ్డి చెందిన బినామీ కంపెనీ తో ఋషికొండలో నిర్మాణం జరుగుతోందని చెప్పారు.విశాఖ లో ప్రముఖ ప్రముఖ పర్యాటక ప్రాంతం ఋషికొండ ను నాశనం చేస్తున్న తీరుపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టు లో పిల్ వేశారని గుర్తు చేశారు.మూర్తి యాదవ్ చేస్తున్న పోరాటానికి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.పర్యాటక శాఖ ప్రైవేట్ శాఖ గా మారిపోయిందని,ఋషికొండ ప్రాంతాన్ని ప్రైవేట్ ఆస్తి గా మార్చుకొని ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడుతున్నారని ద్వజమెత్తారు.ఋషికొండ లో 9.88 ఎకరాలకు అనుమతులు తీసుకుని 80 ఎకరాలలో ఫెన్సింగ్ వేశారని,వైజాగ్ ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారని అన్నారు.ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
Tags: Tourist areas are being destroyed

