పర్యాటక తీరం

Date:10/08/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
తీరప్రాంతంలో పర్యటకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాజధానిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించిన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎకో టూరిజానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి దశ పనులు పూర్తి కావొచ్చాయి. తొలి విడతలో కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పాలకాయతిప్పలో సిద్ధమైంది. దీని వల్ల స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు, ఆర్థికంగా అక్కరకు రానుంది. పర్యటకంగానూ అభివృద్ధి కానుంది. ఇక్కడ రూ. 50 లక్షలతో వివిధ పనులు చేపట్టారు. 195 చదరపు కి.మీలలో అభయారణ్యం విస్తరించింది. గతంలో మడ అడవులు  పూర్తిగా కనుమరుగైన పాలకాయతిప్పలో అటవీశాఖ అభివృద్ధి చేసింది. దాదాపు 32.5 హెక్టార్లలో పెంచింది. సాగరసంగమం వద్ద కృష్ణా నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అనువైనదిగా ఎంపిక చేశారు. దీని వల్ల ఆహ్లాదంతో పాటు పర్యావరణంపై ప్రజలకు ఆసక్తి పెంపొందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాంతంలో విహారం వల్ల అక్కడి జంతుజాలం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.  సమయంలో రెండో దశకు కూడా అటవీ శాఖ సిద్ధమవుతోంది. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి నమూనాలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ పనులు కూడా పూర్తి అయితే పూర్తి స్థాయిలో అన్ని వసతులు సమకూరనున్నాయి. రెండో విడత పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ పనులకు దాదాపు రూ. 40 లక్షలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో చేపట్టనున్న పనులకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ ఓ అవగాహనకు వచ్చింది. వీటికి సంబంధించి నమూనాలు తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇవి ఖరారు అయితే నిధులు విడుదల అవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పర్యటకుల సంఖ్య బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలో సాధారణ రోజుల్లో 2 వేలు మంది, వారాంతాల్లో 5 వేల మంది వరకు వస్తారని భావిస్తున్నారు. వారాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, పర్యావరణ ప్రేమికులు వస్తున్నారు. వసతులు అన్నీ వస్తే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య బాగా పెరుగుతుంది.పాలకాయతిప్ప వద్ద బోటింగ్‌ వసతి ఏర్పాటు చేయనున్నారు. పర్యటకులు పడవుల ద్వారా సుమారు 20 నిముషాల పాటు విహరించే అవకాశం ఉంది. ఇందుకు అనువుగా ఈ ప్రాంతంలో జెట్టీలను కూడా నిర్మించనున్నారు. ఇప్పటికే పడవలు, జెట్టీలను సమకూర్చుకున్నారు. ఇక్కడి బోటింగ్‌ పర్యటకులకు మధురానుభూతులను మిగిల్చనుంది. పాలకాయతిప్ప నుంచి సాగరసంగమం వెళ్లే ప్రాంతంలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తాయి.పర్యటకులు తీరంలో సేదతీరేందుకు అనువుగా పగోడాలను కూడా నిర్మించనున్నారు. వీటి వద్ద మరుగుదొడ్లు, స్నాన గదులను నిర్మిస్తారు. ఈడీసీల ఆధ్వర్యంలో దుకాణాలు, అల్పాహారశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఈడీసీ సభ్యులే చూసుకుంటారు. స్థానికులు తమ జీవనాధారం కోసం ఎక్కువగా అడవులపై ఆధారపడుతున్నారు. దీని వల్ల మడ చెట్లను నరికివేస్తున్నారు. ఎకో టూరిజం వల్ల వారికి ఉపాధి లభిస్తుంది. వచ్చే ఆదాయంలో ఈడీసీలకు వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఇవి మరింత బలోపేతం అవుతాయి.ప్రాజెక్టు ద్వారా లభించే ప్రతి పైసా స్థానిక అభివృద్ధి, వారి జీవనోపాధుల కోసం ఖర్చు చేయనున్నారు. అభయారణ్యంలోకి ప్రవేశించే మార్గంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ రుసుం వసూలు చేస్తారు. ఇది కూడా ఈడీసీలకు వెళ్తుంది. గైడ్లుగా పనిచేసే వారికి కూడా ఉపాధి లభిస్తుంది. నాగాయలంక సమీపంలోని లైట్‌హౌజ్‌ వద్ద, గుంటూరు జిల్లా వైపు ఉన్న మూళ్లగుంట సమీపంలో ఇవి రానున్నాయి. ఇక్కడ వాచ్‌టవర్‌ను నిర్మించనున్నారు.పర్యటకులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా పార్కింగ్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. పిల్లలు ఆడుకునే ప్రాంతాన్ని ఇప్పటికే అభివృద్ధి చేశారు. రెండో విడతలో మరింత విస్తరించనున్నారు. మరిన్ని వసతులు సమకూర్చనున్నారు. దీంతో పాటు పెద్దల కోసం కూడా ఇక్కడ సదుపాయాలను కల్పించనున్నారు.సాగర సంగమం, పాలకాయతిప్ప ప్రాంతాలలో ప్రాజెక్టు కింద వివిధ పనులు చేపట్టారు. ఇందుకు రూ. 50 లక్షలు వెచ్చించారు. ఇప్పటికే ఉన్న రెండు గదులను డార్మిటరీలుగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలోని డాల్ఫిన్‌ హౌస్‌లో పర్యావరణ అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అరుదైన జీవజాతులు, వాటి జీవనశైలి, తదితర విశేషాల గురించి ఇందులో బొమ్మల రూపంలో రూపొందించారు. అంతే కాకుండా ఈ కేంద్రంలో ప్రొజెక్టర్‌ ద్వారా దృశ్య శ్రవణ రూపంలో చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు. ఇందులో అభయారణ్యంలో తిరిగే జంతువులు, అడవులకు సంబంధించిన ఆసక్తికర సమాచారం, వివిధ రకాల మడ చెట్లు, వంటివి ప్రదర్శిస్తారు. పిల్లలకు ప్రత్యేకమైన వినోద స్థలాన్ని నిర్మించారు. ఇందులో చిన్నారులు ఆడుకునేలా వివిధ ఏర్పాట్లు చేశారు. వీటి నిర్మాణం పూర్తి అయింది.
Tags; Tourist shore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *