అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్న యువత-టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:

సైన్యం లో చేరికలను ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడాన్ని దేశంలో యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి  అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్,  ఖైరతాబాద్ తెరాస కార్పోరేటర్ విజయా రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువత వ్యతిరేకించడంలో భాగమే నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన. దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరం. దేశ బలం జవాన్, కిసాన్. రైతులు దేశానికి వెన్నముఖ, సైనికులు దేశ రక్షణ…అని గొప్ప సందేశాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ పైనే కాదు… ఇచ్చిన నినాదం పైనా కక్ష కట్టింది. పార్లమెంట్ లో చర్చించిన తరువాత చేయాల్సిన చట్టాలను.. చట్టాలు చేసిన తరువాత పార్లమెంట్ కి తీసుకువస్తున్నారు. సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం నియమలపై దుందుడుకుగా వ్యవహరిస్తోంది. అగ్నిపథ్ పథకం వల్ల సైన్యం లో చేరిన యువకులకు 4 సంవత్సరాల తరువాత ఎలాంటి సంబంధం లేకుండా బయటకు పంపించే పథకం. ఇప్పటికే దేహదారుడ్య పరీక్షలు పూర్తి చేసుకొని.. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకులపై మోదీ ప్రభుత్వం నిరంకుశత్వం చేస్తుంది. దేశ వ్యాప్తంగా జరిగిన చర్యలే సికింద్రాబాద్ లో జరిగింది. కాంగ్రెస్ హింసకు వ్యతిరేకమని అన్నారు.
పోలీస్ కాల్పుల్లో వరంగల్ కు చెందిన యువకుడు చనిపోయారు. ప్రభుత్వ విధానాల వల్ల వేలాదిమంది యువకులు నిరసన తెలిపారు. ముందుగా లాఠీచార్జి చేయడం వల్ల అక్కడ హింస జరిగింది.

 

 

 

 

సంయమనం కోల్పోయి రైల్వే ఫోర్స్ కాల్పులు జరిపింది. యువకుడు మరణించడం తో పాటు 5 గురికి గాయాలు అయ్యాయి. కోటి రూపాయలు ఇచ్చి పరమర్శించాల్సిన కిషన్ రెడ్డి అమిత్షా దగ్గరికి వెళ్లరు. ట్విట్టర్ పిట్ట ట్విట్టర్ లో ఏదో వాగితే దానికి మాట్లాడుతుండు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు..ఇద్దరు దోషులే. పార్లమెంట్ వేదికగా ఎందుకు నిలదీయలేదు. తక్షణమే అగ్నిపథ్ విధానం ఉపసంహరించుకోవాలి. ప్రధాని పార్లమెంట్ నియోజకవర్గం వారణాసి లో కూడా బస్సులు పగిలయి, రైళ్లు తగులబెట్టారు. వేలాది మంది యువకులు నిరసనలో పాల్గొన్నారని అన్నారు. బాధ్యత కలిగిన కిషన్ రెడ్డి ఎం మట్లాడుతున్నారు. వాళ్ళ అధ్యక్షుడి నాలెడ్జ్ అంతే. కాంగ్రెసు పిలుపునిస్తే టీఆరెస్, ఎంఐఎం దాడి చేసారా..? ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భమా. కిషన్ రెడ్డి బుద్ధి ఉండే మాట్లాడుతు న్నారా. వారణాసి లో కూడా దాడులు జరిగాయి కదా అక్కడ కూడా కాంగ్రెస్ చేయించిందా. రాష్ట్రంలో తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఏఐసీసీ ఆదేశాల ప్రకారం.. నేను వరంగల్ పోతున్న…ఆ కుటుంబాన్ని పరమర్శిస్తా. హింస పరిష్కారం కాదని అన్నారు.
కార్పోరేటర్ విజయరెడ్డి మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని  కలిసాం. మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కి అవినాభావ సంబంధం ఉంది. 23వ తేదీన కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నానని అన్నారు.

 

Tags: TPCC Chief Rewanth Reddy

Leave A Reply

Your email address will not be published.