ట్రాక్టర్ బోల్తా…ముగ్గురు కూలీలు మృతి

Date:17/01/2020

నందిగామ ముచ్చట్లు:

కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ హై స్కూలు దగ్గర శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా అనిగండ్లపాడు వెద్దితిపాడు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వారు వ్యవసాయ పనుల కోసం దేసినేనిపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భారతీ రెడ్డే ఫ్యూచర్ సీఎమ్మా

Tags: Tractor rolled … Three workers killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *