Date:15/01/2021
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులు సుప్రీంకోర్టుకు కీలకమైన హామీ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోకి ట్రాక్టర్లను తీసుకురామని రైతులు స్పష్టం చేశారు.కేంద్రప్రభుత్వం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆదివారం హర్యానాలోని కర్నాల్‌లో వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఏర్పాటు చేసిన వేదికను నిరసన తెలుపుతున్న రైతులు ధ్వంసం చేసిన ఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొంటున్న వేదికను రైతులు ధ్వంసం చేయడంతో ఆయన వెనుదిరిగి పోయారని ఇప్పుడు ఢిల్లీలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా రైతులు తమ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు.
అటార్నీ వాదనపై స్పందించిన సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే రైతు సంఘాల తరపున వాదిస్తున్న డేవ్‌ని ప్రశ్నించారు. చట్టాన్ని ధిక్కరించేవారిని తాము కాపాడదల్చుకోలేదని చెప్పారు. దేశరాజధానికి రైతులు ట్రాక్టర్లు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి నిలదీశారు.దానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంతం దువే వివరణ ఇస్తూ ఆ పని తాము చేయబోమని చెప్పారు. రైతు కుటుంబాల్లో కూడా భద్రతా బలగాలకు సంబంధించిన వారు ఉన్నారు. సైనికులకు వ్యతిరేకంగా రైతులు అలాంటి పని చేయరు. కానీ ఈ విషయంలో నేను ప్రకటన ఇవ్వలేను. ఎందుకంటే నిరసన తెలుపుతున్నవారిలో 400 యూనియన్లకు చెందినవారున్నారు. నిరసన స్థలాల్లో లక్షా 50 వేలమంది రైతులు ఉన్నారు అని దుష్యంత్ దువే కోర్టుకు తెలిపారు.సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనకు నేటితో 48 రోజులు. ఇప్పటికి 8 రౌండ్ల చర్చలు జరిగినా ప్రభుత్వానికి, రైతులకు మధ్య పరిష్కారం కుదరటం లేదు. జనవరి 15న తొమ్మిదో రౌండ్ చర్చలు జరగనుండటం తెలిసిందే.
సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి
Tags: Tractors … Dhee