Natyam ad

ధరలు పెంచేసి చుక్కలు చూపిస్తున్న‌వ్యాపారులు

క‌డ‌ప‌ ముచ్చట్లు:


పంటలకు ఎరువుల వినియోగం పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు ధరలు పెంచేసి చుక్కలు చూపిస్తున్నారు. వరి, పసుపు, చెరుకు, కూరగాయలు ఇతర పంట ఎదుగుదలలో కీలకపాత్ర పోషించే యూరియాను బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధిక వర్షాలకు పత్తి మొక్కలను ఉరక దెబ్బ నుంచి రక్షించుకునేందుకు వ్యవసాయ శాఖ సూచన మేరకు ఎకరాకు 15 కిలోలు పొటాష్‌, 25 కిలోల యూరియా సిఫారసు చేస్తున్నారు. రైతు లెక్కల్లో పరిశీలిస్తే ఇంతకంటే అధికంగానే వినియోగం ఉంటుంది. జిల్లాలో కుందూ, పెన్నా, కెసి, మైలవరం, గండికోట ప్రాంతాలలో వరి సాగు ఊపందుకుంది. మైదుకూరు, దువ్వూరు మండల పరిధిలో కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. టమోట, మిరప పంట వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కిలో ఎరువులు వేస్తున్నారు. మున్ముందు వీటి వినియోగం అధికం కానుంది. పంట ఏదైనా తొలి దశలో ఎరువులు అందించాల్సిన అవసరం ఉంటుంది. డిఎపి, కాంప్లెక్స్‌, పొటాష్‌, ఫాస్ఫేట్‌ వంటి ఎరువుల్లో యూరియా కలిపి వాడుతుంటారు. ఇక వేరుపురుగు, కలుపు నివారణ మందుల్లో కలుపుతున్నారు. రైతుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గరిష్ఠ అమ్మకం ధరకు మించి విక్రయిస్తున్నారు.

 

 

45 కిలోల బస్తాకు రూ.80 అధికంగా పిండుతున్నారు. అవసరం లేని ఇతర ఎరువులు, పురుగు మందులు కొంటేనే అడిగినన్ని యూరియా బస్తాలు ఇస్తామంటూ షరతు పెడుతున్నారు. కంపెనీ విక్రయ కేంద్రాల్లో ఈ పద్ధతి ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి( సొసైటీ) సంఘాల్లో అరకొరగానే ఎరువులను విక్రయిస్తున్నారు. వీటిల్లో మాత్రం గరిష్ఠ చిల్లర ధరలకే ఇస్తున్నారు. అన్నీ సొసైటీల్లో అందుబాటులో లేక దుకాణాల్లోనే అధిక శాతం కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల్లో కోరిన వెంటనే ఎరువులు దొరకడం లేదు. రైతులు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోంది.యూరియా తయారీ సంస్థల నుంచి గూడ్స్‌లో వచ్చిన నిల్వలను డీలరుకి ఇన్‌వాయిస్‌ రేట్లకంటే యూరియాను అధిక ధరకు విక్రయించడంతో ఈ సమస్య తలెత్తిందని వ్యవసాయ శాఖ అధికారులే కొంత మంది బహిరంగ ప్రచారం చేస్తుం డటం గమనార్హం. ఉన్నత స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులకు మా మూళ్లు అందుతుండటంతో చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దస్త్రాల్లో నమోదు చేయకుండా గిడ్డంగుల్లోనే అనదికారికంగా యూరియా బస్తాలు నిల్వ చేస్తున్నారు. సరఫరా దారుడు పత్రాలు ఇవ్వకపోవడంతో అమ్మకాలు నిలిపి వేస్తున్నామని బయటకు చెబుతున్నప్పటికీ వాస్తవాలు వేరుగా ఉంటున్నాయి. సకాలంలో యూరియా వేయకపోతే దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన ఖరీఫ్‌ సాగు అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో పలు మండలాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

 

 

 

 

Post Midle

గతంలో ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి జిల్లాకు 21వేల టన్నుల వరకు యూరియా సరఫరా అయ్యోది. అయితే ప్రస్తుతం జిల్లాకు డీలర్లు, సహకార సంఝాలు, మార్క్పెడ్‌, రైతు భరోసాల ద్వారా గత వారానికి 9679 టన్నుల మాత్రమే వచ్చినట్లు తెలుస్తున్నది. ఎరువుల కంపెనీల నుంచి ప్రైవేటు దుకాణాలకు స్టాకు రావడం లేదు. అయితే సాగు చేస్తున్న పంట విస్తీర్ణం బట్టి కాకుండా ప్రతి రైతుకు ఒకటి, రెండు (45 కిలోలు) మాత్రమే ఇస్తుండడంపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేదని వ్యవసాయాధికారులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని పలువురు రైతులు అంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇంతవరకు దాదాపు 70 శాతం విస్తీర్ణంలో వరి నాట్లు పూర్తయినట్టు అధికారుల సమాచారం. ఈ తరుణంలో వరి, చెరకుతో పాటు ఉద్యాన పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాకు తగినంత యూరియా సరఫరా కాలేదు. కరోనా వైరస్‌..లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీల్లో ఏప్రిల్‌ నుంచి చాలా కాలంపాటు ఎరువులు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ ప్రభావం ఖరీఫ్‌ అవసరాలపై పడింది. ప్రైవేటు ఎరువుల దుకాణాలకు యూరియా సరఫరా దాదాపు నిలిచిపోయింది. కేవలం సహకార సంఘాలకు మాత్రమే పరిమితంగా స్టాకు వస్తోంది. అవసరాలకు సరిపడా ఎరు వులు రాకపోవడంతో ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అందరికీ అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ, ముందుగా డబ్బులు కడితే తప్ప ఎరువులు వచ్చే పరిస్థితి లేదు. గ్రోమోర్‌ కేంద్రాలలో కూడా ఈసారి యూరియా లభించడం లేదు. గత వారంలో జిల్లాలో యూరియా కొరత వాస్తవ పరిస్థితులు గుర్తించేందుకు కమిషనరేట్‌ నుంచి కమిటి పలు మండలాలలో తనిఖీలు నిర్వహించారు.

 

Tags: Traders who increase prices and show dots

Post Midle