వణికిస్తున్నసీజనల్ వ్యాధులు

కరీంనగర్ ముచ్చట్లు:

 

ముసురుతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.  వారం రోజుల వ్యవధిలో  కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 27 డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ఐదు డెంగీ పాజిటివ్‌ వచ్చాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారంలో ఐదు డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే.. జిల్లాలో డెంగీ తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పవచ్చు. మంథని మండలం గోపాలపురం గ్రామం నుంచి పది మందికి పైగా జ్వర పీడితులు ఆసుపత్రిలో చేరారు.కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు రోజుకూ పెరుగుతున్న రోగులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీగా నిర్వహించాల్సిన డెంగీ నిర్ధారణ పరీక్షలు మూడు రోజులకోసారి నిర్వహించడం, రక్తకణాలు తగ్గి ఆసుపత్రిలో అడ్మిటైన రోగులకు సరిపడా ప్లేట్‌లెట్స్‌ రక్తనిధి కేంద్రంలో అందుబాటులో లేకపోవడం, రోగులకు సరిపడా పడకలు, దుప్పట్లు అందుబాటులో లేకపోవడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు.

 

 

సీజనల్‌ జ్వరాల దృష్ట్యా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల ఏర్పాటుతో పాటు సరిపడా మందులు, వైద్యులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. సాధారణ రోజుల్లోనే 300లకు పైగా అడ్మిట్‌ రోగలుండే కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజనల్‌ వ్యాధుల సమయంలో నిత్యం నాలుగు వందల నుంచి ఐదు వందలకు పైగా రోగులతో జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికైనా జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడంతో పాటు 20 శాతం మంది వైద్య సిబ్బందిని అదనంగా జిల్లా ఆసుపత్రిలో నియమించాల్సిన అవసరం ఉంది.వారం రోజులుగా జ్వరం రావడంతో జిల్లా ఆసుపత్రిలో చేరాను.. సిబ్బంది రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి డెంగీ పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. నిన్నటి వరకు సాధారణ జ్వరం అనుకున్నా.. డెంగీ అని చెప్పడంతో భయంగా ఉందంటున్నారు స్థానికులు

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Trading seasonal diseases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *