Natyam ad

పుంగనూరు పట్టణంలో ట్రాఫిక్‌ బ్యారీకేడ్లు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రహదారులపై ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు బ్యారీకేడ్లను వైఎస్సార్‌సీపీ నాయకుడు కొత్తపల్లె చెంగారెడ్డి విరాళంగా అందజేశారు. శుక్రవారం బ్యారీకేడ్లను ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి కలసి సీఐ గంగిరెడ్డికి అందజేశారు. పట్టణ బైపాస్‌రోడ్డు, పీఎల్‌ఆర్‌ రోడ్డుతో పాటు అవసరమైన ప్రాంతాలలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు బ్యారీకేడ్లను వినియోగిస్తామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి , సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శివకుమార్‌, రామోజి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Traffic barricades in Punganur town

Post Midle

Leave A Reply

Your email address will not be published.