Natyam ad

పొగమంచు తో రాకపోకలకు అంతరాయం

-ఢీకొన్న వాహనాలు, పలువురికి గాయాలు

 

నెల్లూరు ముచ్చట్లు:


పొగ మంచు కారణంగా నెల్లూరు జిల్లా మనుబోలు  మండలం బద్దివోలు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్, కారు, ద్విచక్ర వాహనం ఒక దానికి ఒకటి ఢీ కొట్టిన ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునుండే కమ్మేసిన పొగ మంచు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు కలుగుతోంది. దాంతో విద్యార్దులు, ఉద్యోగులు తమ తమ  గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు.జిల్లావ్యాప్తంగా గురువారం వరకు ఉపరితల ఆవర్తన ద్రోని ప్రభావంతో వర్షాల వల్ల ఇబ్బందులకు గురైన ప్రజలు నేడు తెల్లవారుజాము నుండి తీవ్ర పొగ మంచుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, చెన్నై ,కలకత్తా ప్రధాన జాతీయ రహదారిపై  వాహనాలు చాలా నిదానంగా కదులుతున్నాయి, దీంతో కాలేజీలకు, పాఠశాలకు వెళ్లే విద్యార్థుల దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఇతర అన్ని రంగాల ప్రయాణికులు,సరుకు రవాణా వాహనాలు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు, ఈ పొగ మంచు ప్రభావం వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం తో పాటు సాధారణ ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు కూడా గురవుతున్నారు ప్రకృతి ఒక్కరోజులోనే ఇలా మారిపోవడంతో కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

 

Post Midle

Tags: Traffic disruption due to fog

Post Midle

Leave A Reply

Your email address will not be published.