జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
గూడూరు ముచ్చట్లు:
తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై- కలకత్తా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది . ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఇరువైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది . గూడూరు – నెల్లూరు రోడ్డు మార్గంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలను తొలగించడంలో ఆలస్యం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు . ఈ మార్గం మీదుగా ప్రయాణించే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు . నేషనల్ హైవే అథారిటీ అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి .
Tags: Traffic jam on national highway