రోడ్డు ప్రమాదంలో ఆటవీ అధికారి మృతి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్ల సైదాపురం మండలం తుమ్మల తలుపూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీ కొని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుధాకర్ మృతి చెందాడు. మృతునిది నెల్లూరు రూరల్ మండలం చేముడుగుంట ప్రాంతం. తుమ్మల తలుపూరు ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ తుమ్మలతలుపూరు మలుపు వద్ద బైక్ పై వస్తుండగా బస్సు ఢీ కొంది. సుధాకర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం పొదలకూరు కు తరలించగా మార్గ మధ్యంలో నే మృతి చెందాడు.
Tags: Traffic officer dies in road accident

