Natyam ad

అక్రమ ఇసుక దందా కు అడ్డుకట్ట వేసిన ట్రాఫిక్ పోలీసులు

-పోలీస్ స్టేషన్ కు బండ్లు తరలింపు
 
హిందూపురం ముచ్చట్లు:
 
అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలో ఎద్దుల బండ్ల లో అక్రమంగా ఇసుక రవాణాకు ట్రాఫిక్ పోలీసులు అడ్డుకట్ట వేసారు.  ప్రభుత్వ అనుమతులు ఏ మాత్రం లేకుండా నిత్యం వందలాది ఎద్దుల బండ్ల లో పెన్నా నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న సొమ్ముచేసుకుంటున్నారు.  కొంతమంది ట్రాక్టర్లకు పర్మిషన్ లేకపోవడంతో దీన్ని ఆసరా చేసుకున్న కొంతమంది ఎడ్లబండ్ల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తు  సొమ్ము చేసుకుంటున్నారు.  ప్రతిరోజు ప్రధాన రహదారులు గుండా అక్రమంగా ఎద్దుల బండ్ల లో ఇసుక తరలిస్తున్న డంతో ట్రాఫిక్ కు కూడా కాస్త అంతరాయం ఏర్పడుతుంది ఇప్పటికే అక్రమంగా ఇసుక తరలింపు పోతుంది దానితోపాటు ఎద్దుల బండ్ల తో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు ఎద్దుల బండ్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు బండ్ల తోపాటు పశువులు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉండడంతో వాటికి మేత నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తమ జీవనాధారం విజయంతో ఎద్దుల బండ్లు నిర్వాహకులు వాపోతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Traffic police crack down on illegal sand mining