Natyam ad

ఢిల్లీలో 3 రోజులు ట్రాఫిక్  నియమాలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో G20 సమ్మిట్‌ జరుగనున్న వేళ నోయిడా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షల గురించి పలు సూచనలు ఇచ్చారు. పలు రూళ్లలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొన్నింటిని దారి మళ్లించారు. నోయిడా సరిహద్దు నుంచి ఢిల్లీకి భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాల ప్రవేశంపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.చిల్లా రెడ్ లైట్ (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు చిల్లా రెడ్ లైట్ వద్ద యూ-టర్న్ తీసుకొని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించి తమ గమ్యస్థానం వైపు వెళ్లాల్సి ఉంటుంది.

 

 

 

Post Midle

ఢిల్లీ-నోయిడా-డైరెక్ట్  ఫ్లై ఓవర్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు DND టోల్ ప్లాజా వద్ద యు-టర్న్ తీసుకొని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా తమ గమ్యస్థానం వైపు వెళ్లడానికి పోలీసులు అనుమతించారుకాళింది కుంజ్ యమునా (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు యమునా నది మొదటి అండర్‌పాస్ ట్రై-సెక్షన్ నుంచి మళ్లిస్తారు. తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా వెళ్లాలి. న్యూ అశోక్ నగర్ (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు, డీఎస్‌సీ రోడ్ నుంచి వచ్చే ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, డీఎస్‌సీ రోడ్‌లో గోల్చక్కర్ చౌక్ సెక్టార్ 15 ద్వారా వెళ్లేలా డైవర్ట్ చేశారు. కొండ్లీ/ఝుంద్‌పురా సరిహద్దు కొండ్లీ/ఝుంద్‌పురా (సరిహద్దు) నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు స్టేడియం చౌక్, సిటీ ప్రాంతం మీదుగా ప్రయాణించాలి.

 

 

 

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా నుంచి ఢిల్లీ వైపు వెళ్లే భారీ వాహనాలతోపాటు ఇతర వాహనాలను యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై నిషేధించారు. పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి వంటి నిత్యావసర వస్తువుల రవాణా వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ఇవే ఆంక్షలు విధించారు. పారి చౌక్ నుంచి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఢిల్లీ, లేదా ఇతర ప్రాంతాలలోకి ప్రవేశించే వాహనాలు హోండా సీల్ చౌక్, సిర్సా గోల్చక్కర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గాన్ని తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానించారు. P-03 గోల్చక్కర్ గ్రేటర్ నోయిడా వారికి కూడా ఇదే వర్తిస్తుంది.సూరజ్‌పూర్ ఘంటా చౌక్ నుంచి పారి చౌక్‌కు మీదుగా ఢిల్లీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సూరజ్‌పూర్ ఘంటా చౌక్, తిల్పటా గోల్‌చక్కర్, సిర్సా గోల్చక్కర్, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా తమ గమ్యస్థానం వైపు వెళ్లవచ్చు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే నుంచి ఢిల్లీ,

 

 

 

ఇతర ప్రాంతాలలోకి ప్రవేశించి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ప్రయాణించే వాహనాలు జెవార్ కస్బా, సబౌటా అండర్‌పాస్, జహంగీర్‌పూర్, ఖుర్జా, సికింద్రాబాద్, బులంద్‌షహర్‌లకు బైపాస్ ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు.గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా, ఢిల్లీ మధ్య ప్రయాణించేటప్పుడు ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. నోయిడా ట్రాఫిక్ పోలీస్ 99710 09001, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ 1095/011-25844444 నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు తక్షణ సాయం అందించడానికి వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్ 87508 71493ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సూచనల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే ప్రజలకు తెలియజేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

 

Tags: Traffic rules for 3 days in Delhi

Post Midle