ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

Trafficking in sand should be strict

Trafficking in sand should be strict

– సొంత పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబునాయుడు దొంగ దీక్షలు చేస్తున్నాడు

– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Date:14/11/2019

అమరావతి ముచ్చట్లు:

ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల పాటు వైసీపి నాయకులకు దీక్షలు చేయకుండా అక్రమ అరెస్టులు చేయించారని అన్నారు. ఇసుక వల్లే తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ కి చెక్ పెడుతూ ఇసుక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది అన్నారు. ఇందులో భాగంగా చిన్న రోడ్లు మరియు పెద్ద రోడ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఉండడానికి 150 నుండి 200 వరకు ప్రత్యేకమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణా గాని అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచిన వారికి 2 లక్షల రూపాయల జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

 

పొలకల్ లో మనబడి నాడు-నేడు

 

Tags:Trafficking in sand should be strict

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *