Tragedy at home

సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం

Date:23/05/2020

చెన్నై ముచ్చట్లు:

ఒకప్పటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందాడు. ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. నిద్రలోనే తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది. నటి వాణిశ్రీకి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా పనిచేస్తున్న అభినయ్ ఈ రోజు తెల్లవారుజామున మరణించాడు. అభినయ్‌కు భార్యతో పాటు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలుగా పనిచేస్తోంది. అభినయ్ గతంలో రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. దీంతో వాణిశ్రీ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంక్షేమమే… తారక మంత్రమా…

Tags: Tragedy at home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *