పండగ ముందే విషాదం
విద్యుత్ షాక్ తో ముగ్గురు చిన్నారులకు గాయాలు
నారాయణఖేడ్ ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో సంక్రాంతి పండగ ముందే విషాదం నెలకొంది. మంగళవారం బేడ బుడగ జంగాల కాలనీలో ఓ ఇంటిపై గాలిపటాలు ఎగురవేస్తున్నారు. ఇంటి పక్కనుండి 33కేవీ విద్యుత్ లైన్ ఉంది. ఆ సమయంలో లోకేష్ (11), సాయిరాం (9), సుదర్శన్ (10) అనే ముగ్గురు చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లకు తగిలి ముగ్గురికి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేష్ ను హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కి తరలించారు. మరో ఇద్దరిని బీదర్ ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబీకులు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Tragedy before the festival