Natyam ad

సీఎం సభలో విషాదం విధుల్లో  వున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పర్యటన లో విషాదం చోటుచేసుకుంది. సీఎం సభకు విధులు నిర్వహించేందుకు వచ్చిన అనకాపల్లి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గుండెపోటు తో మృతిచెందారు. విధుల్లో భాగంగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో గమనించిన తోటి పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అప్పారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.మృతుడు అప్పారావు మరి కొద్దిరోజుల్లో  ఏఎస్సై గా ప్రోమోట్ పొందనున్నట్లు సమాచారం. తోటి పోలీస్ సిబ్బంది తెలియజేస్తున్నారు.

 

Tags: Tragedy in CM Sabha Head Constable who was on duty died due to heart attack

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.